అంజలి, లక్ష్మీ రాయ్‌ మధ్య గొడవ..! | Ananda Bhairavi Film Anjali And Laxmi Rai Acts Competitively | Sakshi
Sakshi News home page

అంజలి, లక్ష్మీ రాయ్‌ మధ్య గొడవ..!

Feb 17 2020 5:54 PM | Updated on Feb 17 2020 6:06 PM

Ananda Bhairavi Film Anjali And Laxmi Rai Acts Competitively - Sakshi

మన పక్కింటి అమ్మాయిలా ఇంకా చెప్పాలంటే మనింట్లో అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి. తను హిందీ ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్‌తో గొడవ పడింది.

షాపింగ్ మాల్, జర్నీ వంటి చిన్న సినిమాలతో కెరీర్‌ స్టార్ట్ చేసి గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో పెద్ద హీరోయిన్ స్థాయికి చేరుకున్న తెలుగు ముద్దుగుమ్మ అంజలి. మన పక్కింటి అమ్మాయిలా ఇంకా చెప్పాలంటే మనింట్లో అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి. తను హిందీ ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్‌తో గొడవ పడింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బయట ఎక్కడా గొడవ పడక పోయినా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో 'ఆనంద భైరవి' చిత్రం కోసం గొడవ పడే సన్నివేశంలో పోటీపడి నటించారు.

వైజాగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైన్‌మెంట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీరం తిరుపతి రెడ్డి-రమేష్ రెడ్డి ఇటికేల నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కర్రి బాలాజీ. సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా, ఎడిటర్ : చోట కె ప్రసాద్. జూలీ-2 తో హిందీ కుర్రకారుని ఉర్రూతలూగించిన లక్ష్మీ రాయ్‌.., తమిళ్‌లో ఎన్నో చిత్రాలలో నటించిన సంగతి తెలిసిదే. తెలుగులోనూ పలు చిత్రాలతో పాటు మెగా స్టార్ చిరంజీవి సరసన ‘అమ్మడూ.. లెట్స్‌ డూ కుమ్ముడు’ ఐటమ్ సాంగ్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం పాయిజన్-2 లో శృంగార దృశ్యాలలో నటిస్తూ  కుర్రకారు మతులు పొగొట్టబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement