breaking news
Heroin Anjali
-
అంజలి, లక్ష్మీ రాయ్ మధ్య గొడవ..!
షాపింగ్ మాల్, జర్నీ వంటి చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో పెద్ద హీరోయిన్ స్థాయికి చేరుకున్న తెలుగు ముద్దుగుమ్మ అంజలి. మన పక్కింటి అమ్మాయిలా ఇంకా చెప్పాలంటే మనింట్లో అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి. తను హిందీ ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్‌తో గొడవ పడింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బయట ఎక్కడా గొడవ పడక పోయినా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో 'ఆనంద భైరవి' చిత్రం కోసం గొడవ పడే సన్నివేశంలో పోటీపడి నటించారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీరం తిరుపతి రెడ్డి-రమేష్ రెడ్డి ఇటికేల నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కర్రి బాలాజీ. సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా, ఎడిటర్ : చోట కె ప్రసాద్. జూలీ-2 తో హిందీ కుర్రకారుని ఉర్రూతలూగించిన లక్ష్మీ రాయ్.., తమిళ్లో ఎన్నో చిత్రాలలో నటించిన సంగతి తెలిసిదే. తెలుగులోనూ పలు చిత్రాలతో పాటు మెగా స్టార్ చిరంజీవి సరసన ‘అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడు’ ఐటమ్ సాంగ్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం పాయిజన్-2 లో శృంగార దృశ్యాలలో నటిస్తూ కుర్రకారు మతులు పొగొట్టబోతోంది. -
'గీతాంజలి' దర్శకుడు రాజ్‌కిరణ్ కి గుండెపోటు
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన 'గీతాంజలి' చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెహదీపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో ఒత్తిడికి గురైన రాజ్‌కిరణ్ ఈరోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో హీరోగా మారారు. రాజ కిరణ్ దర్శకత్వంలో సినీ రచయిత కోన వెంకట్ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. గీతాంజలి సినిమా ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే.