'కిల్ దిల్' ట్రైలర్ పై అమితాబ్ ప్రశంసలు | Amitabh Bachchan praises 'Kill Dil' trailer | Sakshi
Sakshi News home page

'కిల్ దిల్' ట్రైలర్ పై అమితాబ్ ప్రశంసలు

Sep 20 2014 5:17 PM | Updated on Apr 3 2019 6:23 PM

'కిల్ దిల్' ట్రైలర్ పై అమితాబ్ ప్రశంసలు - Sakshi

'కిల్ దిల్' ట్రైలర్ పై అమితాబ్ ప్రశంసలు

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కిల్ దిల్' చిత్రంపై బిగ్ బి అమితాబచ్చన్ ప్రశంసల వర్షం కురిపించాడు

ముంబై: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కిల్ దిల్' చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ పై బిగ్ బి అమితాబచ్చన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రముఖ నటుడు రణ్ వీర్ సింగ్, పరిణితీ చోప్రాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్ర ట్రైలర్ అమితాబ్ ను ఎంతగానో ఆకట్టుకుందట. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టం చేశాడు. 'ట్రైలర్ చాలా విన్నూత్నంగా ఉంది. ఆ ట్రైలర్ కు  దర్శకుడు షహీద్ ఆలీ న్యాయం చేయాలి' అని అమితాబ్ పేర్కొన్నాడు


ఇప్పటి వరకూ కామెడీ ఎంటర్ టైనర్ మూవీలతో అలరించిన హీరో గోవిందా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 'కిల్ దిల్' మూవీలో గోవిందాతో పాటు రణవీర్ సింగ్, అలీ జాఫర్ నటిస్తున్నారు.  తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యశ్ రాజ్ చోప్రా బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీని షహీద్ అలీ డైరెక్ట్ చేస్తున్నారు. ముగ్గురు హీరోల మధ్య జరిగే కామెడీ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని డైరెక్టర్ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement