డబుల్‌ ఖుషీ!

Amitabh Bachchan to make Kollywood debut with Uyarndha Manidhan - Sakshi

సింగిల్‌ షాట్‌లో డబుల్‌ వర్క్‌ అంటే ఇదేనేమో. ఒక్క సినిమాతో ఇటు బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటే...అటు కోలీవుడ్‌ స్టార్‌ ఎస్‌.జె. సూర్య ఫస్ట్‌ టైమ్‌ నటుడిగా బాలీవుడ్‌కి వెళ్తున్నారు. అయితే తెలుగులో తాను తెరకెక్కించిన హిట్‌ మూవీ ‘ఖుషి’ హిందీ రీమేక్‌ ద్వారా ఆల్రెడీ బాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక తాజాగా కమిట్‌ అయిన తమిళ, హిందీ సినిమా విషయానికొస్తే.. తమిళ్‌వానన్‌ దర్శకత్వంలో అమితాబ్, ఎస్‌.జె. సూర్య ముఖ్య తారలుగా రూపొందనుంది. తమిళంలో ‘ఉయంర్ద మణిదన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

చెన్నైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని ఎస్‌.జె. సూర్య తెలిపారు. ఈ సినిమాకు దాదాపు రెండేళ్ల పాటు గ్రౌండ్‌ వర్క్‌ చేశారట టీమ్‌. ఈ చిత్రం టీజర్‌ పోస్టర్‌ను రజనీకాంత్‌ విడుదల చేసిన వీడియోను ఎస్‌.జె. సూర్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘నా ఫ్రెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ తమిళ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది ఇండస్ట్రీ గర్వించే సమయం. అలాగే హిందీ ఇండస్ట్రీకి ఈ సినిమాతో ఎస్‌.జె. సూర్య ఎంట్రీ ఇస్తుండటం సంతోషంగా ఉంది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని ఆ వీడియోలో రజనీ పేర్కొన్నారు. ‘‘ఇండియన్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌తో కలిసి హిందీ పరిశ్రమకు వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు సూర్య. అంటే సూర్యకు ఇప్పుడు డబుల్‌ ఖుషీ అన్నమాట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top