సంగీత కచేరి | Amit Trivedi to perform in Hyderabad | Sakshi
Sakshi News home page

సంగీత కచేరి

Nov 15 2018 2:03 AM | Updated on Nov 15 2018 2:03 AM

Amit Trivedi to perform in Hyderabad - Sakshi

అమిత్‌ త్రివేది

దాదాపు పది సినిమాలకు పైగా సంగీతం అందిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు అమిత్‌ త్రివేది. కెరీర్‌లో తొలినాళ్లలో థియేటర్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత పలు జింగిల్స్, యాడ్‌ ఫిల్మ్స్‌ చేశారు. ‘ఆమిర్‌’ చిత్రంతో పదేళ్ల క్రితం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ప్రస్థానం స్టార్ట్‌ చేసి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో ప్లేస్‌ సంపాదించుకున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దేవ్‌ డి’ చిత్రానికి జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ‘ఉడాన్, వేకప్‌ సిడ్, మన్‌మర్జియాన్‌’ వంటి బాలీవుడ్‌ సినిమాలకు సంగీతం అందించిన ఆయన సౌత్‌లో చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో అమిత్‌ త్రివేది సంగీత కచేరీ జరగనుంది. ‘ఇంద్రధనస్సు– అమిత్‌ త్రివేది లైవ్‌ కన్సర్ట్‌’ పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement