జల్లికట్టు నేపథ్యంగా అమీర్‌ చిత్రం | Amir jallikattu backdrop film | Sakshi
Sakshi News home page

జల్లికట్టు నేపథ్యంగా అమీర్‌ చిత్రం

Jan 14 2017 2:12 AM | Updated on Sep 5 2017 1:11 AM

జల్లికట్టు నేపథ్యంగా అమీర్‌ చిత్రం

జల్లికట్టు నేపథ్యంగా అమీర్‌ చిత్రం

దర్శకుడు అమీర్‌ చిత్రాలు కాస్త భిన్నంగా ఉంటాయి.

దర్శకుడు అమీర్‌ చిత్రాలు కాస్త భిన్నంగా ఉంటాయి. పరుత్తివీరన్‌ చిత్రంతో జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అమీర్‌ చిన్న గ్యాప్‌ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం సందనదేవన్‌. ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. నటి అతిథి నాయకి. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం శుక్రవారం సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర దర్శక నిర్మాత అమీర్‌ మాట్లాడుతూ కళ రాష్ట్ర, దేశాలను దాటి ప్రపంచస్థాయికి చేరుకుందన్నారు. ఇది ఆహ్వానించదగ్గ అంశమేనని పేర్కొన్నారు. అమ్మపై గౌరవంతో రామ్, తమిళుల ఆచార వ్యవహారాలపై పరుత్తివీరన్‌ చిత్రాలను రూపొందించిన తాను ఓ దశలో కమర్షియల్‌ పోకడలో ఆదిభగవాన్‌ లాంటి చిత్రల వైపు దృష్టి సారించానన్నారు.

ఇకపై తమిళ సంస్కృతికి  సంబం«ధించిన కథా చిత్రాలే రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపా రు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయి న జల్లికట్టు ప్రధాన అంశంగా సందనదేవన్‌ చిత్రం ఉంటుందన్నారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధిం చడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా  జల్లికట్టుపై  నిషేధాన్ని ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.  ఇందు లో జల్లికట్టుకు సంబంధించిన ఒక పాటను శనివారం రికార్డ్‌ చేసి అదే రోజున విడుదల చేయనున్నట్లు తెలిపా రు. అమీర్‌ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని నటుడు ఆర్య అన్నారు. ఈ చిత్రానికి పాటలు రాయడం సంతోషంగా ఉందని వైరముత్తు అన్నారు.

40.
యదార్థ సంఘటన ఆధారంగా మున్నోడి

 మున్నోడి చిత్ర విడుదల హక్కులను ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ మదన్‌ పొంది విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, అళగర్‌సామియిన్‌ కుదిరై, కేడీబిల్లా కిల్లాడిరంగా, వరుత్తపడాద వాలిభరర్‌సంఘం, దేసింగ్‌రాజా, కయల్, మాప్పిళైసింగం, కొడి వంటి పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన తాజాగా ఎన్నైనోక్కి పాయుమ్‌ తోటా, విక్రమ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల హక్కులను పొందారన్నది గమనార్హం. ఒక మనిషి ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటాడో అతని జీవతం అదే బాటలో పయనిస్తుందన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మున్నోడి అని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌పీటీఏ.కుమార్‌ తెలిపారు. స్వíస్తిక్‌ సినీవిజన్‌ పతాకంపై ఎస్‌పీటీఏ.రాజశేఖర్, సోహం అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా హరీష్, యామిని భాస్కర్‌ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇది చెన్నైలో జరిగిన యదార్థసంఘటన ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం అయినా యూనివర్శల్‌ సబ్జెక్ట్‌ కావడంతో ఏ భాషలో అయినా మంచి ఆదరణను పొందుతుందని దర్శకుడు పేర్కొన్నారు. తమ చిత్ర విడుదల హక్కుల్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ పొందడంతో కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement