నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు | Tamil Actor Arya Reveals Asking Raaka Movie Chance But Denied | Sakshi
Sakshi News home page

Arya: అల్లు అర్జున్ 'రాకా'.. ఆర్యకు బ్యాడ్ లక్

Apr 20 2026 1:01 PM | Updated on Apr 20 2026 1:18 PM

Tamil Actor Arya Reveals Asking Raaka Movie Chance But Denied

రీసెంట్ టైంలో తమిళ హీరో ఆర్య షాకిచ్చే కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. కాశీలో ఉన్న సాధువుల్లో 40 శాతానికి పైగా దొంగలే అని, వాళ్లంతా హత్యల్లాంటివి చేసి వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ వేషం వేసుకున్నారని చెప్పాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. వీటిని పక్కనబెడితే ఇప్పుడు అల్లు అర్జున్ 'రాకా' మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అడిగినా సరే తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)

ఆర్య హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' సినిమా గత వీకెండ్ తెలుగులోనూ రిలీజైంది. కాకపోతే ఇక్కడెవరూ పట్టించుకోలేదు. దీని ప్రమోషన్లలో భాగంగానే అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. 2013లో 'రాజారాణి' సినిమా విడుదలైనప్పుడు దర్శకుడు అట్లీని మెచ్చుకున్నాడని, ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి 'రాకా' చేస్తుండటం సంతోషంగా ఉందని అన్నాడు. మరి ఆ మూవీలో రోల్ ఏమైనా అడిగారా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను అడిగాను కానీ వాళ్లు ఇవ్వలేదని ఆర్య నవ్వేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

'పుష్ప' సినిమాల తర్వాత బన్నీ ఎవరితో పనిచేస్తాడా అని అంతా అనుకుంటున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీకి అవకాశమిచ్చాడు. చాన్నాళ్లుగా షూటింగ్ జరుగుతోంది. పదిరోజుల క్రితం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మైండ్ బ్లోయింగ్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు 'రాకా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా గ్లోబల్ ఆడియెన్స్ టార్గెట్ పెట్టుకుని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఈ ఏడాది సంగతి పక్కనబెడితే వచ్చే ఏడాది కూడా రిలీజ్ కాకపోవచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement