నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో: బన్నీ

Allu Arjun Wishes His Son Ayaan 6th Birthday - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. శుక్రవారం అయాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బన్నీ,ఆయన సతీమణి స్నేహా తన ముద్దుల కొడుకుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘‘ప్రేమ అంటే ఏంటని నా జీవితమంలో ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాను. గతంలో చాలా సార్లు అనేక భావాలను పొందాను. కానీ అప్పుడది ప్రేమ కాదని నాకు తెలియదు. అయితే ఎప్పుడైతే నువ్వు(అయాన్‌) నా జీవితంలోకి వచ్చావో అప్పుడే నాకు ప్రేమంటే ఎంటో తెలిసింది. ప్రేమకు అర్థం నువ్వు. లవ్‌ యూ అయాన్‌. హ్యపీ బర్త్‌డే మై బేబీ’’.. అంటూ తన కొడుకుపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. (బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్‌..)

ఇక అల్లు అర్జున్‌ తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడన్న విషయం తెలిసిందే. సినిమాల నుంచి బ్రేక్‌ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తూంటాడు. సినిమాలతోపాటు ఇద్దరు పిల్లలకు(అయాన్‌, అర్హ) సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. అ‍ల్లు అర్జున్‌తోపాటు ఈ పిల్లలకు కూడా ఫాలోయింగ్‌ బాగానే ఉంది. ముఖ్యంగా బన్నీ గారాలపట్టి అర్హ చేసే అల్లరికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. (అతిథిగా అర్హ.. అల్లు అర్జున్‌ ఏమన్నారంటే..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top