బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్‌..

Shriya Saran Bartan Saaf Karo Challenge To Allu arjun And Arya - Sakshi

కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఇళ్లకే పరిమితమైన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా కరోనాపై జనాల్లో అవగాహన పెంచడమే కాక, అభిమానులకు వినోదాన్ని అందించేలా పలు పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్‌ శ్రియ సరికొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. తన భర్త అండ్రీ కొచ్చిన్‌ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను శ్రియ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చాలెంజ్‌ను(బార్తన్‌ సాఫ్‌ కరో) స్వీకరించాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్‌, ఆర్యలతో పాటు పలువురిని నామినేట్‌ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ చాలెంజ్‌ విసిరారు. 

‘నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా?. ఎందుకంటే.. నాకు వంట పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. పెళ్లైనా మగవాళ్లు అందరూ.. వారి అందమైన భార్యలకు సాయం చేయాలని నేను చాలెంజ్‌ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరని ఈ చాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నాను’ అని  శ్రియా తెలిపారు. కాగా, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసిన శ్రియ.. 2018లో ఆండ్రీ కొచ్చివ్‌ అనే బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ను ఆమె వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top