కొత్త ఏడాదిలో కొత్త సినిమా ప్రకటిస్తాడట..!

Allu Arjun Will Announce His Next Movie On January 1st - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్‌ తిన్న అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు తన నెక్ట్స్‌ మూవీ ఏ దర్శకుడితో అన్న విషయాన్ని కూడా ప్రకటించని బన్నీ న్యూ ఇయిర్‌ వేడుకల సందర్భంగా అభిమానులు తీపి కబురు చెప్పనున్నాడట.విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుదన్న ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే విక్రమ్‌, నానితో సినిమా ఎనౌన్స్‌ చేయటంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

ప్రస్తతుం అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా దర్శకులంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు పరశురాం పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా అంతరిక్షం సక్సెస్‌ తరువాత సంకల్ప్‌ రెడ్డితో బన్నీ సినిమా అంటూ కొత్త ప్రచారం మొదలైంది. మరి ఈ దర్శకుల్లో బన్నీ ఎవరి ఫైనల్ చేస్తాడు..? కొత్త ఏడాది ఎలాంటి ప్రకటన చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top