
తల దువ్వేదొకరు (హెయిర్ డ్రస్సర్).. తళుక్కుమనే బట్టలు తెచ్చేవారొకరు (కాస్ట్యూమ్ డిజైనర్).. తళ తళ మెరిసేలా చేసేదొకరు (మేకప్ ఆర్టిస్ట్)... సెట్‌లో హీరోగారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ బోల్డంత మంది రెడీ! అల్లు అర్జున్‌కీ అంతే. ఎవరి పనుల్లో వాళ్లు తలమునకలై ఉంటే... అర్జున్ యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తారు.
సీన్‌లో ఎలా చేస్తే బాగుంటుంది? బుర్రలో బోల్డన్ని టెన్షన్స్! సెట్‌లో సీన్‌కి కట్ చెప్పి ఇంట్లో ఓపెన్ చేశారనుకోండి... నో సిన్మా టెన్షన్స్! పిల్లలతో బన్నీ (అల్లు అర్జున్) టైమ్ స్పెండ్ చేసే సీన్ ఓపెన్ చేస్తే... నో హెల్పర్స్! సెట్‌లో టెన్షన్స్ నుంచి ఫ్రీ కావడానికి పిల్లలతో బన్నీ సరదాగా ఏదొక ఆట ఆడుతుంటారట! ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న ఫొటో అటువంటి టైమ్‌లోదే. రీసెంట్‌గా అబ్బాయితో క్రికెట్ ఆడారు బన్నీ. బాబు (బన్నీ కుమారుడు అయాన్) బ్యాటింగ్ చేస్తుంటే... బన్నీ బౌలింగ్ చేశారు. ఈ ఆటను అల్లు స్నేహ (బన్నీ వైఫ్) వీడియో తీశారు. అదండీ సంగతి!!