బన్నీ కొత్త సినిమా ఓకే చేశాడా..? | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 7 2018 10:42 AM

Allu Arjun Next Movie Confirmed - Sakshi

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా మే 4న రిలీజ్‌ కానుంది. అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా కోలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. కమర్షియల్ విజయాలు లేకపోయినా.. అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్‌ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ సినిమాను చేయబోతున్నాడట. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించిన బన్నీకి నటుడిగా మంచి పేరు వచ్చింది. తాజాగా మరోసారి అదే డైరెక్టర్‌తో వర్క్‌ చేసేందుకు బన్నీ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement