అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం | Allu Arjun Maternal Uncle Passes Away In Vijayawada | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం

Jan 23 2020 10:27 AM | Updated on Jan 23 2020 9:58 PM

Allu Arjun Maternal Uncle Passes Away In Vijayawada - Sakshi

ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు అర్జున్‌ తల్లి నిర్మలాదేవికీ రాజేంద్ర ప్రసాద్‌ స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మామయ్య. బన్నీకి ప్రసాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. తమ కుటుంబానికి దగ్గరగా ఉండే ప్రసాద్‌ చనిపోయారని తెలియడంతో అల్లు ఫ్యామిలీ విజయవాడకు బయల్దేరారు.(బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న బన్నీ సినిమా)

బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ప్రసాద్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే బన్నీ మేనమామ ప్రసాద్‌ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఆయన కూడా ఓ నిర్మాతగా ఉన్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు రెగ్యూలర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాకముందే ఆయన హఠాన్మరణం చెందారు. ప్రసాద్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

చదవండి :రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement