రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ​

Ram Gopal Varma Comments On RK Roja And Balakrishna Selfie - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ దిగారు. దీంతో ప్రస్తుతం రోజా-బాలకృష్ణల సెల్ఫీలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఈ ఫోటోలపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన రీతిలో స్పందించాడు. ఆ ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ వరుస కామెంట్లు చేశాడు. 

‘సెల్ఫీలో రోజాగారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా(యాక్‌)గా ఉన్నారు. ఈ ఫ్రేమ్‌లో అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారు. ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు’ అని వర్మ ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా?’ అని కోరుతూ వర్మ మరో ట్వీట్‌ చేశాడు. ఇక దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలి సమావేశాలను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకులు వీఐపీ గ్యాలరీల్లో నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఆర్కే రోజా మర్యాదపూర్వకంగా పలకరించి, కాసేపు ముచ్చటించారు. అనంతరం రోజాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు బాలయ్యతో సెల్ఫీలు దిగారు.
 

చదవండి:
బాలయ్య న్యూలుక్‌ అదిరింది!!
 

ఆ సంఘటన నన్ను కలచివేసింది: వర్మ

ఏపీ రాజధానిపై రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top