ఏపీ రాజధానిపై వర్మ కామెంట్స్‌ | Ram Gopal Varma Comments On AP Capital Issue | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధానిపై రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్‌

Dec 27 2019 8:06 PM | Updated on Dec 27 2019 8:34 PM

Ram Gopal Varma Comments On AP Capital Issue - Sakshi

విశాఖపట్నం: ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ రాజధానిపై స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. తనవరకు రాజధాని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని స్పష్టం చేశారు. రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వర్మ వ్యాఖ్యానించారు. రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిది అని చెప్పిన వర్మ.. ప్రజలకు నేరుగా పాలన అందాలంటే ప్రతి పట్టణానికి ఒక రాజధాని  ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విశాఖలో జరిగిన 'బ్యూటిఫుల్' సినిమా ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

హాట్ హీరోయిన్‌‌తో వర్మ నాటు స్టెప్పులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement