బాలయ్య న్యూలుక్‌.. న్యూ అప్‌డేట్‌!

Nandamuri Balakrishna New Look Viral In Social Media - Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్‌మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు. ఈ మధ్యనే వచ్చిన ‘రూలర్‌’ చిత్రంలో స్టైలీష్‌ లుక్‌లో ఆకట్టుకున్న బాలయ్య తాజాగా గుండుతో దర్శనమిచ్చాడు. ఖద్దర్‌ బట్టలతో, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో భాగంగానే బాలయ్య గుండు చేయించుకున్నారని టాక్‌. ఇక ఈ సినిమాలో బాలయ్యను డిఫరెంట్‌ షేడ్స్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట బోయపాటి శ్రీను. అంతేకాకుండా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారట. ఇందులో భాగంగానే పూర్తి మాస్‌ యాంగిల్‌లో కనిపించే విధంగా బాలయ్య గుండుతో కనిపించనున్నారని సమాచారం. అయితే బాలయ్యకు సంబంధించి ఈ న్యూలుక్‌ సినిమా కోసమా లేక సాధారణంగా దిగిన ఫోటోనా తెలియాల్సి ఉంది. 

ఇక సినిమాల పరంగా తాను ఏ పాత్ర చేసినా అందులో లీనమవడంతో పాటు ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా బాలకృష్ణ సిద్దంగా ఉంటాడు. ‘రూలర్‌’ సినిమా కోసం బరువు తగ్గి ఐరన్‌ మ్యాన్ లుక్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో పాటు అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్‌ బయోపిక్‌లు కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో బాలయ్యతో పాటు నందమూరి ఫ్యాన్స్‌ కూడా బోయపాటి శ్రీనివాస్‌ పైనే ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనైనా బాలయ్య సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. 

అయితే ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తేదీనే(జులై 30న) ఈ చిత్రం రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జులై 30న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చే అవకాశం లేకపోవడంతో అదే తేదీన ఈ చిత్రం రిలీజ్‌ చేస్తే అన్నివిధాల కలిసొస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ డేట్‌ను కూడా బుక్‌ చేసుకున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

చదవండి:
‘రూలర్‌’ మూవీ రివ్యూ
అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top