ధనుష్‌తో సై | Alia Bhatt to romance Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో సై

Jan 24 2014 12:46 AM | Updated on Apr 3 2019 6:23 PM

ధనుష్‌తో సై - Sakshi

ధనుష్‌తో సై

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న బ్యూటీ అలియాభట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ భామ ఆ తరువాత హైవే చిత్రంలో

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న బ్యూటీ అలియాభట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ భామ ఆ తరువాత హైవే చిత్రంలో నటిస్తున్నారు. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ధనుష్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే కేవీ ఆనంద్ దర్శకత్వంలో అనేగన్ చిత్రంలో నటించే అవకాశాన్ని ఈ బ్యూటీ తిరస్కరించారు. అయితే ఆ తరువాత అలియాభట్ పునరాలోచనలో పడ్డట్టున్నారు. అందుకు కారణం బాలీవుడ్‌లో ధనుష్ నటించిన రాంజనా మంచి విజయాన్ని సాధించడం, ఆ తరువాత మరో హిందీ చిత్రంలో నటించడానికి ఆయన సిద్ధం కావడం వంటివి గుర్తుకు వచ్చి ఓకే చేసింది. దీంతో ఈమె ధనుష్ సరసన బుక్ అయ్యింది. అయితే ఈ జాణ కోరి సంపాదించుకున్న అవకాశమే ఇది. ధనుష్ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తాజాగా ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ భామ అలియాభట్ ధనుష్ సరసన నటిస్తానని డెరైక్ట్‌గా దర్శకుడు వెట్రిమారన్‌ను అడిగేశారట. వెతుకుతున్న తీగ కాలికి తగినట్లు ఆయన కూడా ఓకే అన్నారట. అంత సడన్‌గా అలియాభట్ మనసు మార్చుకోవడానికి కారణం బాలీవుడ్‌లో ధనుష్ క్రేజే అని వేరే చెప్పాలా.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement