కాలిపోతూ.. టైటిల్‌ ప్రకటించిన హీరో

Akshay Kumar Web Series THE END - Sakshi

బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా దూసుకుపోతున్నారు అక్షయ్‌ కుమార్‌. సినిమా సినిమాకు తన మార్కెట్‌ రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు అక్షయ్‌. సామాజిక ‍స్పృహతో సినిమాలు చేస్తూ.. రియల్‌ లైఫ్‌లో కూడా మంచి మనసును చాటుకుంటున్నాడీ రియల్‌ హీరో. తాజాగా అక్షయ్‌ చేసిన విన్యాసం అందర్నీ ఆశ్చర్య పరిచేలా చేసింది.

అక్షయ్‌ ప్రస్తుతం కేసరి సినిమాతో బిజీగా ఉండగా.. అదే సమయంలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. అక్షయ్‌ మంటల్లో కాలుతూ.. ఈ టైటిల్‌ను ప్రకటించాడు. ది ఎండ్‌ అంటూ ఇది కేవలం ఆరంభమే.. అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. తాజాగా రిలీజ్‌ చేసిన అక్షయ్‌ కేసరి ట్రైలర్‌ సోషల్‌ మీడియా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top