పి వర్సెస్‌ పి | Akshay Kumar & Sanjay Leela Bhansali Press Meet | Sakshi
Sakshi News home page

పి వర్సెస్‌ పి

Feb 23 2018 12:10 AM | Updated on Jul 14 2019 3:29 PM

Akshay Kumar & Sanjay Leela Bhansali Press Meet - Sakshi

సంజయ్‌లీలా భన్సాలీ, అక్షయ్‌కుమార్‌

టాలీవుడ్‌లోనే కాదు.. అటు బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ డేట్స్‌ విషయంలో ‘వార్‌’ సహజమైంది. ‘తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్‌ చేసుకునే హక్కు ప్రతి చిత్రబృందానికి ఉంటుంది’ అని అక్షయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘పద్మావత్‌’ వర్సెస్‌ ‘ప్యాడ్‌మ్యాన్‌’ రిలీజ్‌ డేట్స్‌ విషయంలో. దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ ముఖ్య తారలుగా సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పద్మావత్‌’.

సెన్సార్‌ చిక్కులతో రిలీజ్‌ డేట్స్‌ను మార్చుకుంటూ ఫైనల్‌గా జనవరి 25కి థియేటర్స్‌లో సెటిల్‌ అవ్వాలనుకుంది ‘పద్మావత్‌’ చిత్రబృందం. చెప్పిన డేట్‌ (జనవరి 26)కి ఒక్కరోజు ముందుకు దూకాడు ‘ప్యాడ్‌మ్యాన్‌’. అంటే.. రెండు సినిమాలూ ఒకేరోజున వచ్చే పరిస్థితి. అక్షయ్‌కుమార్, రాధిక ఆప్టే, సోనమ్‌కపూర్‌ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్‌’. పద్మావత్, ప్యాడ్‌మ్యాన్‌ ఒకేరోజున రిలీజ్‌ కావడం సరికాదని ఫైనల్‌గా ‘పద్మావత్‌’ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ‘ప్యాడ్‌మ్యాన్‌’ హీరో అక్షయ్‌కుమార్‌ మాట్లాడుకున్నారు.

కలిసి విలేకర్ల సమావేశం పెట్టారు. అప్పుడే ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్‌కుమార్‌. అలాగే బాలీవుడ్‌ మూవీ ‘అయ్యారీ’ని ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ క్లాష్‌ వద్దనుకుని ఫిబ్రవరి 16న రిలీజ్‌ చేశారు. అంతేకాదు అనుష్క శర్మ ‘పరి’ (మార్చి 2న విడుదల) సినిమాతో బాక్సాఫీస్‌ క్లాష్‌ వద్దనుకుని ముందుగా అనుకున్నట్లుగా ‘హేట్‌స్టోరీ 4’ చిత్రాన్ని మార్చి 2న కాకుండా వారం రోజులు ముందుకు (మార్చి 9) జరిపాడు ఆ చిత్రదర్శకుడు  విశాల్‌ పాండ్య.

Advertisement
 
Advertisement
Advertisement