శ్రీవారి సేవలో అఖిల్ | Akkineni Akhil Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో అఖిల్

Jul 9 2019 12:25 PM | Updated on Jul 9 2019 12:25 PM

Akkineni Akhil Visits Tirumala Temple - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే నాలుగో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ నిర్మాతలో సినిమాను ప్రారంభించిన అఖిల్ త్వరలో షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.

షూటింగ్ ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ‘నాలోని శక్తిని తెలుసుకునే సరైన ప్లేస్‌ తిరుమల. ఏడు కొండలు నడిచి శ్రీవారి దర్శనానికి వచ్చాను. కొత్త సినిమాను ఫోకస్డ్‌గా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నా గోవిందా గోవిందా’ అంటూ ట్వీట్ చేశాడు అఖిల్‌. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement