17 కేజీల బరువు తగ్గాడు | Ajay Devgan s stylish sword fight in Action Jackson | Sakshi
Sakshi News home page

17 కేజీల బరువు తగ్గాడు

Oct 29 2014 11:25 PM | Updated on Apr 3 2019 6:23 PM

17 కేజీల బరువు తగ్గాడు - Sakshi

17 కేజీల బరువు తగ్గాడు

పెరిగినంత తేలిక కాదు.. బరువు తగ్గడం. కానీ... మన హీరోలు మాత్రం అవలీలగా బరువు పెరుగుతున్నారు, అంతే ఈజీగా తగ్గుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ... అజయ్‌దేవగన్.

 పెరిగినంత తేలిక కాదు.. బరువు తగ్గడం. కానీ... మన హీరోలు మాత్రం అవలీలగా బరువు పెరుగుతున్నారు, అంతే ఈజీగా తగ్గుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ... అజయ్‌దేవగన్. ప్రస్తుతం ఆయన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకుడు. కథ రీత్యా ముందు బరువు పెరగమని అజయ్‌కి చెప్పారట ప్రభుదేవా. దర్శకుని మాట ప్రకారం బరువు పెరిగారు అజయ్. మళ్లీ ఉన్నట్టుండి 17 కేజీలు బరువు తగ్గమన్నారట ప్రభు. అంతే, రెండు నెలల్లో 17 కేజీలు బరువు తగ్గించేశారట అజయ్. ఇందులో అజయ్‌దేవగన్ చొక్కా లేకుండా నటించాల్సిన సీన్స్ ఉన్నాయి. ఫిట్‌గా కనిపించాలనే ఉద్దేశంతోనే ఆయన్ను ప్రభుదేవా తగ్గమన్నారట. ఏదేమైనా ముందు బరువు పెరగడం, మళ్లీ రెండే నెలల్లో 17 కేజీలు తగ్గడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.మళ్లీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement