రీమేక్ కోసం అలియా,రాధిక కావాలట..! | Adivi Shesh want Alia and Radhika For Kshanam Bollywood remake | Sakshi
Sakshi News home page

రీమేక్ కోసం అలియా,రాధిక కావాలట..!

Mar 5 2016 12:49 PM | Updated on Jul 14 2019 4:31 PM

రీమేక్ కోసం అలియా,రాధిక కావాలట..! - Sakshi

రీమేక్ కోసం అలియా,రాధిక కావాలట..!

చాలా రోజులు సోలో హీరోగా సక్సెస్ కొట్టాలని ఎదురుచూస్తున్న యంగ్ హీరో అడవి శేష్, క్షణం సినిమాతో ఆ కోరిక తీర్చేసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు, కథా రచయితగా, స్క్రీన్ప్లే రైటర్గా కూడా...

చాలా రోజులు సోలో హీరోగా సక్సెస్ కొట్టాలని ఎదురుచూస్తున్న యంగ్ హీరో అడవి శేష్ 'క్షణం' సినిమాతో ఆ కోరిక తీర్చేసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు, కథా రచయితగా, స్క్రీన్ప్లే రైటర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోష్లో ఇప్పుడు బాలీవుడ్లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు శేష్. బాహుబలి సినిమాతో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన శేష్, ఇప్పుడు హీరోగా తన మార్క్ చూపించాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం క్షణం సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న అడవి శేష్, ఈ సినిమా బాలీవుడ్ రీమేక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే బాలీవుడ్లో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పిన శేష్, మరోసారి రిషి పాత్రలో తానే నటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాతో అదాశర్మ చేసిన శ్వేత పాత్రకు అలియాభట్, అనుసూయ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు రాధిక ఆప్టేలు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారని చెబుతున్నాడు. మరి నిర్మాతలు అడవి శేష్ కోసం ఈ కాస్టింగ్ను సెట్ చేస్తారేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement