పెళ్లికొడుకు కావాలంటున్న ఆదాశర్మ

Adah Sharma Is Looking For Groom But She Has A List Of Conditions - Sakshi

ఆదాశర్మ పెళ్లికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. తనకో పెళ్లి కొడుకు కావాలంటూ పెళ్లి కూతురు గెటప్‌లో తయారై ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. కాకపోతే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే వాడు ఎలా ఉండాలనే విషయంలో కొన్ని షరతులను విధించింది. 'అతను ఉల్లిపాయలు తినకూడదు. కులం, రంగు, మతం, కండలు తిరిగిన దేహం, స్విమ్మింగ్‌, వీసా, జాతకం లాంటి విషయాలు పట్టించుకోను. కాకపోతే అతను మూడు పూటలా నవ్వుతూ వండిపెట్టాలి. ఇంట్లో జీన్స్‌ ధరించినా పర్లేదు కానీ బయటకు వెళ్లేటప్పుడు మాత్రం భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. నేనే స్వయంగా రోజుకు 5లీటర్ల మంచినీరు అందిస్తా.. కానీ ఇంటా బయట మద్యం, మాంసాహారం ముట్టుకోవద్దు. క్రమం తప్పకుండా షేవ్‌ చేసుకోవాలి. అలాగే అతనికి భారతదేశంలోని అన్ని భాషా చిత్రాల మీద గౌరవం కలిగి ఉండాలి' అని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

అయితే ఆదాశర్మ చేసిన ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆదా ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో,  ఆమె పెట్టిన షరతులను చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆదాశర్మ ఈ మధ్యనే ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆదా కమాండో 3, బైపాస్‌ రోడ్‌, మ్యాన్‌ టు మ్యాన్‌ హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top