చక్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల  | Actor Vishal Movie Chakra First Look Poster Released | Sakshi
Sakshi News home page

చక్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల 

Jun 24 2020 7:46 AM | Updated on Jun 24 2020 7:46 AM

Actor Vishal Movie Chakra First Look Poster Released - Sakshi

హీరో విశాల్‌ ఇటీవల సైబర్‌ క్రైం కథా చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కోలివుడ్‌ కోడై కూస్తోంది. విశాల్‌ గతంలో పీస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో నటించిన ఇరుంబుతిరై చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నటి సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రం సైబర్‌ క్రైం ఇతివృత్తంతో రూపొందిందన్నది తెలిసిందే. కాగా తాజాగా విశాల్‌ చక్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయ నే నిర్మాత. నటి శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకుడిగా అవుతున్నారు. కాగా ఇది సైబర్‌ క్రైం రూపొందుతున్న చిత్రం తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. చదవండి: నన్ను చాలా టార్చర్‌ చేశారు 

దీనికి ప్రేక్షకుల మంచి స్పందన వస్తుంది. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ ను విడుదల చేయనున్నట్లు విశాల్‌ తెలిపారు. కాగా ఆయన చక్ర చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విశాల్‌ మంగళవారం విడుదల చేశారు. చిత్రాన్ని లాక్‌డౌన్‌ ముగిసిన తర్వా త తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా తుప్పరివాలన్‌ 2 చి త్రం లోనూ విశాల్‌ నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నారు. మిష్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా షూటింగ్‌ మధ్యలో దర్శకుడు మిష్కిన్, విశాల్‌కు మధ్య విభేదాలు తలెత్తడంతో తుప్పరివాలన్‌ 2 చిత్రాని కి సమస్యలు తలెత్తాయి. అయితే ఇ ప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలు కూడా విశాల్‌ చేపట్టి పూర్తి చేయడానికి సిద్ధం అయ్యారు. ఇది 2017 విశాల్‌ న టించిన తుప్పరివాలన్‌ చిత్రానికి సీక్వెల్‌. చదవండి: బాలీవుడ్‌కు సూర్య చిత్రం? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement