బాలీవుడ్‌కు సూర్య చిత్రం?  | Surya Latest Film Surarai Potru Is Remake In Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు సూర్య చిత్రం? 

Jun 24 2020 7:34 AM | Updated on Jun 24 2020 7:38 AM

Surya Latest Film Surarai Potru Is Remake In Bollywood - Sakshi

సూర్య తాజా చిత్రం సూరరై పోట్రు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోందా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో సూర్య ఒకరు. సూర్య తన పాత్రలో జీవించడానికి ఎంత వర కైనా వెళ్తారు. తాజాగా ఆయన నటిస్తు న్న చిత్రం సూరరై పోట్రు. తన టుడీ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై సూర్య సొంతగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. నటి అపర్ణ బాల మురళి కథానాయికగా నటించిన ఇందులో తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ముఖ్య పాత్ర ల్లో నటించారు.

బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్, స్పైడర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ తర్వాత తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా సూరరై పోట్లు చిత్రం జీఆర్‌ గోపీనాథ్‌ బయోపిక్‌తో రూపొందిన చిత్రం. ఈయన డెక్కన్‌ ఎయిర్‌ విమాన సంస్థ అధినేత. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన గోపీనాథ్‌ తన కలను సాకారం చేసుకుని ఒక విమాన సంస్థ అధినేత స్థాయికి చేరుకున్నారు. ఆయన జీవిత చరిత్రతో తెరకెక్కిన సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి: నన్ను చాలా టార్చర్‌ చేశారు 

కాగా ఈ చిత్రం క్రేజ్‌ బాలీవుడ్‌ వరకు తాకింది. దీంతో ఒక ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ సూరరైపోట్రు చిత్రం హిందీ రీమేక్‌ హక్కులను ఫాన్సీ ఆఫర్‌తో కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్‌లో నటించడానికి హీరోగా సాహిద్‌ కపూర్, రాఖీ సావంత్‌ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తం మీద సూరరై పోట్రు చిత్రం విడుదలకు ముందే అంచనాలను పెంచేస్తోందన్నమాట. చదవండి: నా బ్రాండ్‌ రెడ్‌ట్రీ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement