‘నువ్వు ఎప్పుడూ మామకు ప్రియమైన దానివే’ | Abhishek Bachchan Adorable Wishes For His Niece On Her Birthday | Sakshi
Sakshi News home page

‘నువ్వు ఎప్పుడూ మామకు ప్రియమైన దానివే’

Dec 6 2018 3:07 PM | Updated on Dec 6 2018 3:08 PM

Abhishek Bachchan Adorable Wishes For His Niece On Her Birthday - Sakshi

‘ప్రపంచంలోనే కూలెస్ట్‌ కిడ్‌.. నా నవ్యకు 21వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇప్పుడు నుంచి నువ్వు అధికారికంగా మహిళవి! చిన్నతనంలో నా చేయి పట్టుకుని నడిచిన ఆ చిన్నారి నాకు మంచి నేస్తం అయింది. నువ్వు ఎప్పుడూ మామకు అత్యంత ప్రియమైన దానివే. అందులో ఎటువంటి మార్పు ఉండదు. లవ్‌ యూ’ అంటూ బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ తన ముద్దుల మేనకోడలు నవ్య నవేలి నందాకు బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. దీంతో ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కూలెస్ట్‌ కిడ్‌ నవ్య అయితే ప్రపంచంలోనే గొప్ప మావయ్య అభిషేక్‌ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక తన గారాల పట్టి.. పుట్టిన రోజు సందర్భంగా శ్వేత నందా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. నవ్య చిన్ననాటి ఫొటోతో పాటుగా... ‘ వసంతాలు గడిచిపోలేదు.. వాటి పని అవి చేశాయి అంతే... నువ్వు అందులోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించావు. మనమిద్దరం కలిసే పెరిగాం. ఇప్పుడు ఇద్దరికీ 21 ఏళ్లు. హ్యాపీ బర్త్‌ డే నవ్‌. లవ్‌ యూ’ అంటూ ఆమె క్యాప్షన్‌ జతచేశారు. కాగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌కు కూతురు శ్వేతా నందా, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ ఉన్న సంగతి తెలిసిందే. బిజినెస్‌మేన్‌ నిఖిల్‌ నందా- శ్వేత దంపతులకు నవ్య, అగస్త్య సంతానం.

Advertisement
 
Advertisement
Advertisement