రుచి...వాసన తెలియడంలేదు | Aaron Tveit Tests Positive for COVID-19 | Sakshi
Sakshi News home page

రుచి...వాసన తెలియడంలేదు

Mar 27 2020 12:51 AM | Updated on Mar 27 2020 12:51 AM

Aaron Tveit Tests Positive for COVID-19 - Sakshi

అరోన్‌ ట్వైట్‌

హాలీవుడ్‌ తారలు టామ్‌ హ్యాంక్స్, ఇద్రిస్‌ ఎల్బాలతో పాటు మరికొందరు కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో నటుడు, గాయకుడు అరోన్‌ ట్వైట్‌ చేరారు. ‘‘కరోనా బారిన పడిన కొందరితో పోల్చితే నా పరిస్థితి బాగానే ఉంది. నాకు జ్వరం లేదు. కొంచెం జలుబు మాత్రమే ఉంది. అంతమాత్రాన కరోనాని తేలికగా తీసిపారేయడానికి లేదు. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్‌. నా వరకు నేను రుచిని కోల్పోయా. ఏం తిన్నా చప్పగానే ఉంది. అలాగే వాసన తెలియడంలేదు. ఇది కూడా కరోనా లక్షణాల్లో భాగమే. ఒకవేళ మీకు జ్వరం, జలుబు ఏమీ లేకపోయినా నేను చెప్పిన లక్షణాలు కనిపించినా టెస్ట్‌ చేయించుకోండి’’ అని పేర్కొన్నారు అరోన్‌.

Advertisement
 
Advertisement
Advertisement