ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

Aamir Khan, Saif Ali Khan to star in Hindi remake of Vikram vedha - Sakshi

ఆమిర్‌ ఖాన్, సైఫ్‌ అలీ ఖాన్‌ స్క్రీన్‌ మీద తలపడనున్నారు. మరి ఎవరు గెలుస్తారు? ప్రస్తుతానికి సస్పెన్స్‌. 2017లో తమిళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్‌ వేదా’. మాధవన్, విజయ్‌ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం పుష్కర్‌ గాయత్రి రూపొందించారు. ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌లో పలువురు హీరోలు నటిస్తారని వార్తలు వినిపించాయి. ఫైనల్‌గా ఆమిర్‌ ఖాన్, సైఫ్‌ అలీఖాన్‌ ఈ రీమేక్‌లో నటించనున్నారు. మాధవన్‌ పాత్రలో సైఫ్, సేతుపతి పోషించిన పాత్రను ఆమిర్‌ ఖాన్‌ చేస్తారట. 2020 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. వై నాట్‌ స్టూడియోస్, నీరజ్‌పాండే, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ నిర్మించనున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top