ఈ సక్సెస్‌ మా నాన్నగారికి అంకితం

118 Movie Grand Success Meet - Sakshi

–కల్యాణ్‌ రామ్‌

‘‘షూటింగ్‌కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్‌ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్‌మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్‌. ఇలా చాలా డిపార్ట్‌మెంట్స్‌ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్‌రామ్‌ అన్నారు. కెమెరామేన్‌ కేవీ గుహన్‌ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌గా, షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటించారు. మహేశ్‌ యస్‌ కోనేరు నిర్మాత.

మార్చి 1న రిలీజ్‌ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్‌ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్‌. గుహన్‌గారి నెక్ట్స్‌ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్‌ కాంప్లిమెంట్‌ తారక్‌ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్‌. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్‌ ది బెస్ట్‌ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు.

‘‘డిస్ట్రిబ్యూటర్‌గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్‌ మెమొరీస్‌ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్‌ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్‌ బాగా ప్రమోట్‌ చేశారు. సక్సెస్‌తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్‌ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు షాలినీ పాండే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top