వేసవికి ప్రత్యేక రైళ్లు | Special Trains for Summer | Sakshi
Sakshi News home page

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Jan 26 2018 9:44 AM | Updated on Jan 26 2018 9:44 AM

Special Trains for Summer - Sakshi

ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పిఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి–కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07942) మార్చి 4, 11,18,25 తేదీల్లో, ఏప్రిల్‌ 1,8,15,22,29, మే 6,13,20,27, జూన్‌ 3,10,17,24 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.

కాకినాడ టౌన్‌–రేణిగుంట రైలు (07941) మార్చి 5,12,19,26, ఏప్రిల్‌ 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్‌ 4,11,18,25 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.00కు రేణిగుంట చేరుతుంది.

తిరుపతి–నాగర్‌సోల్‌ రైలు (07417) మార్చి 2,9,16,23,30 తేదీల్లో, ఏప్రిల్‌ 6,13,20,27, మే 4,11,18,25, జూన్‌ 1,8,15,22,29 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.55కు నాగర్‌సోల్‌ చేరుకుంటుంది.

నాగర్‌సోల్‌–తిరుపతి రైలు (07418) మార్చి 3,10,17,24, ఏప్రిల్‌ 7,14,21,28, మే 5,12,19,26, జూన్‌ 2,9,16,23,30 తేదీల్లో రాత్రి 10.00 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి రెండోరోజు ఉదయం 4.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement