నీళ్లిచ్చి మా పంటల్ని బతికించండి: రైతులు | karimnagar farmers protest | Sakshi
Sakshi News home page

నీళ్లిచ్చి మా పంటల్ని బతికించండి: రైతులు

Feb 7 2018 4:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

సాక్షి, కరీంనగర్‌: రైతు శ్రేయస్సే తమకు ముఖ్యమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం తమ పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద జగిత్యాల-కరీంనగర్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు విడుదల చేసి ఎండుతున్న పంటల్ని కాపాడాలని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం తదితరుల్ని అరెస్టు చేశారు. రాస్తారోకో కారణంగా జగిత్యాల-కరీంనగర్ రూట్‌లో ట్రాఫిక్‌ భారీగా జామ్‌ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement