డయానా వెర్రిది.. అయినా ఆమెతో.. | Would've Slept With Princess Diana Though She Was Crazy: Donald Trump | Sakshi
Sakshi News home page

డయానా వెర్రిది.. అయినా ఆమెతో..

Sep 26 2017 4:29 PM | Updated on Aug 25 2018 7:52 PM

Would've Slept With Princess Diana Though She Was Crazy:  Donald Trump - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నోరు జారారు. ఆయన అధికారంలోకి రాకముందు ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్‌ రాణి ప్రిన్స్‌ డయానాపై అసభ్యంగా మాట్లాడారు. డయానా ఓ వెర్రిబాగులదని, అయినప్పటికీ తాను కాదనకుండా ఆమెతో ఏకాంతంగా గడిపేవాడినంటు చెప్పవీలుకాని మాటలు అన్నారు. హోవార్డ్‌ స్టెర్న్‌ 2000 సంవత్సరంలో ట్రంప్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన అన్న మాటలను తాజాగా చిన్న ట్రాన్‌స్క్రిప్ట్‌ల, ఆడియోల రూపంలో విడుదల చేసింది. 'ఆమె మంచి ఎత్తుంటుంది. మంచి రూపవతి. సూపర్‌ మోడల్‌ బ్యూటిఫుల్‌.. ఆకర్షణీయురాలు.. ఆమె చర్మం వర్ణించలేను... ఇంకా చెప్పాలంటే ఆమె ఒక వెర్రిబాగులది.. ఇవన్నీ కూడా కొద్ది వివరాలు మాత్రమే' అంటూ ఆయన అన్నారు.

ఆమె వెర్రిది అయినప్పటికీ తాను ఆమెతో కాదనకుండా ఏకాంతంగా గడిపేవాడినని చెప్పారు. అంతేకాకుండా 1997లో స్టెర్న్‌కు, ట్రంప్‌కు మధ్య జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టింది. ఇందులో ట్రంప్‌ మరో అనూహ్య కామెంట్లు చేశారు. తాను ఏ మహిళతోనైనా శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు ఆమెను హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలని కోరేవాడినని అప్పటి ఇంటర్వ్యూలో ట్రంప్‌ చెప్పారు. ఇక 2000 సంవత్సరంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్‌ టాప్‌ టెన్‌ హాట్‌ మహిళల గురించి చెప్పగా మొదటి స్థానంలో ఆయన మొదటి భార్యను, రెండో స్థానంలో ఆయన ప్రస్తుత భార్యను, మూడో స్థానంలో డయానాను పేర్కొన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement