భారత్‌కు రూ.490 కోట్లు తరలించిన షరీఫ్‌..!!

World Bank Denies Reports That Nawaz Sharif Laundered 490 Crores To India - Sakshi

వాషింగ్టన్‌, అమెరికా : పనామా పత్రాల వ్యవహారంలో పదవి కోల్పోయిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌కు 490 కోట్ల రూపాయలు హవాలా రూపంలో తరలించినట్లు మంగళవారం రిపోర్టులు వెలువడ్డాయి. దీనిపై పాకిస్తాన్‌ అవినీతి నిరోధక సంస్థ, జాతీయ అకౌంటబిలిటీ బ్యూరలో విచారణకు ఆదేశించాయి.

ప్రపంచబ్యాంకు మంగళవారమే రెమిటెన్సెస్‌ అండ్‌ మైగ్రేషన్‌ రిపోర్టు - 2016ను విడుదల చేసింది. దీని ఆధారంగానే షరీఫ్‌ భారత్‌కు హవాలా రూపంలో వందల కోట్ల రూపాయలు తరలించారంటూ పాకిస్తాన్‌ మీడియా కథనాలను ప్రచురించింది. కాగా, మీడియా కథనాలను ప్రపంచబ్యాంకు బుధవారం ఖండించింది.

ప్రపంచంలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి(దేశాల మధ్య) ఎన్నిసార్లు మారుతోందన్న విషయంపై మాత్రమే బ్యాంకు అధ్యాయనం చేస్తుందని వివరించింది. రిపోర్టులో హవాలాకు సంబంధించిన ఎలాంటి వివరాలను ప్రచురించలేదని వెల్లడించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌(ఎస్‌బీపీ) రూ. 490 కోట్లు 2016 సెప్టెంబర్‌ 21న పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తరలివెళ్లాయని పేర్కొంది. తమ రిపోర్టును ఎస్‌బీపీ తప్పుగా అర్థం చేసుకుందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top