ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

Woman Punches Man In Face Repeatedly In Scottish Bar - Sakshi

గ్లాస్గో : అదో స్కాటిస్‌ బార్‌. ఓ మధ్యవయస్కుడు తన పక్కనున్న యువతితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి ఓ యువతి వచ్చింది. రావటంతోటే అతడిపై పంచులు కురిపించింది. లేడీ టైసన్‌లా మారి అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. అంతా డబ్ల్యూడబ్ల్యూఈలో లాగా జరిగిపోయింది. క్షణాల్లో అతడి ముఖం రక్తసిక్తమైంది. ఆమెనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు! కుదరలేదు. ఆమె పక్కకు జరగటంతో అతను మీదకు వెళ్లాడు. ఆమె మళ్లీ అతడిపై దాడి చేసింది. చివరకు అక్కడి వారు వారిద్దరినీ పట్టుకుని పక్కకు తీసుకుపోవటంతో గొడవ సద్దుమణిగింది. కాగా, తనను రక్తం వచ్చేలా కొట్టినా అతడు ఆమెపై గట్టిగా చేయిచేసుకోకపోవటం గమనార్హం. జులై 13న గ్లాస్గోలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన్నులు తిన్న వ్యక్తి, చితక్కొట్టిన మహిళ ఎవరో తెలియరాలేదు. గ్లాస్గోకు చెందిన గేరీ మెకే అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అయితే దీనిపై స్పందించిన స్కాట్లాండ్‌ పోలీసులు.. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియకుండా ఏమీ మాట్లాడలేమని తేల్చిచెప్పేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top