
పెషావర్ కంటే తీవ్రమైన దాడి చేస్తాం: తాలిబన్ చీఫ్
గత సంవత్సరం డిసెంబర్ నెలలో పెషావర్ లో సృష్టించిన విధ్వంసం కంటే ఈసారి తీవ్రమైన దాడిని చేస్తామని తాలిబన్లు హెచ్చరించారు.
పెషావర్: గత సంవత్సరం డిసెంబర్ నెలలో పెషావర్ లో సృష్టించిన విధ్వంసం కంటే ఈసారి తీవ్రమైన దాడిని చేస్తామని తాలిబన్లు హెచ్చరించారు. దీనికి సంబంధించిన తాలిబన్ చీఫ్ మౌలానా ఫజుల్లాహ్ పేరుతో విడుదల అయిన వీడియో తాజాగా కలకలం రేపుతోంది.' పెషావర్ లో భారీ విధ్వంసం సృష్టించాం. ఈసారి అంతకంటే తీవ్రమైన దాడి చేస్తాం' అని ఆ వీడియో ద్వారా సోమవారం హెచ్చరికలు జారీ చేశాడు.
2014 వ చివర్లో పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబాన్లు పాల్పడిన ఘాతకంలో 148 మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16 వ తేదీన చేసిన తాలిబన్ల దాడిలో ఎక్కువ మంది విద్యార్థులు మరణించారు.