ప్రసవ వేదన తట్టుకోలేక.. దూకేసింది | Video: Chinese woman begs family for caesarean delivery before killing herself | Sakshi
Sakshi News home page

ప్రసవ వేదన తట్టుకోలేక.. దూకేసింది

Sep 9 2017 9:34 AM | Updated on Nov 6 2018 8:08 PM

ప్రసవ వేదన తట్టుకోలేక.. దూకేసింది - Sakshi

ప్రసవ వేదన తట్టుకోలేక.. దూకేసింది

మహిళల పునరుత్పత్తి హక్కులను మరోసారి చర్చకు తెచ్చిన ఉదంతమిది. పురుటి నొప్పులను తట్టుకోలేని ఓ మహిళ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం విభ్రాంతికి గురి చేసింది.

సాక్షి, బీజింగ్‌:   ప్రపంచ వ్యాప్తంగా మహిళ  పునరుత్పత్తి హక్కులను మరోసారి  చర్చకు తెచ్చిన ఉదంతమిది. బిడ్డను ఎపుడు ఎలా కనాలనే నిర్ణయాధికారం మహిళలకు పీడకలగానే మిగులుతోంది.  చైనాలో   ఇలాంటి ఘటనకు  సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు  వైరల్‌ అయింది. పురుటి నొప్పులను తట్టుకోలేని ఓ  మహిళ  అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం విభ్రాంతికి గురి చేసింది.  చనిపోవడానికి ముందు నొప్పితో విలవిల్లాడుతూ..కుటుంబ సభ్యులను వేడుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి.

చైనాకు చెందిన మహిళ (24) ప్రసవ వేదనను భరించలేక ఆసుపత్రి భవనంలోని 5వ అంతస్తు నుంచి దూకేసింది. దీంతో తల్లీ, బిడ్డ ఇద్దరూ  కన్నుమూశారు.  బిడ్డతల పెద్దదిగా ఉండటంతో నార్మల్‌ డెలివరీ చాలా కష్టమైంది. దీంతో సిజేరియన్ డెలివరీ కోసం తన కుటుంబాన్ని వేడుకుంది. అయితే చైనా చట్టాల ప్రకారం దీనికికుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరి. ఈ విషాద సంఘటనతో మహిళల పునరుత్పాదక హక్కులను కోరుతూ  అక్కడి మహిళలు  నిరసననకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement