మహిళా జవాను ఆచూకీ చెబితే.. రూ.19 లక్షలు

US Army offers 19 Lakhs rupees reward for missing soldier information - Sakshi

టెక్సాస్‌  : అమెరికాలో కనిపించకుండా పోయిన మహిళా జవాను వానెస్సా గిల్లెన్‌(20) సమాచారం తెలిపిన వారికి 25000 డాలర్ల(దాదాపు 19 లక్షల రూపాయలు) భారీ రివార్డును అమెరికా ఆర్మీ ప్రకటించింది. చివరిసారిగా ఏప్రిల్‌22న టెక్సాస్‌లోని ఫోర్ట్‌హుడ్‌ ఆర్మీ బేస్‌లోని కార్‌పార్కింగ్‌లో గిల్లెన్‌ కనిపించినట్టు సమాచారం. గిల్లెన్‌ ఐడీ కార్డు, వాలెట్‌లను అదే రోజు ఉదయం ఆమె పనిచేస్తున్న ఆయుధాలు భద్రపరిచే గదిలో లభించాయి. గిల్లెన్‌ కనిపించకుండా పోవడంపై ఆమె కుటుంబ సభ్యులు, లీగ్‌ ఆఫ్‌ యునైటెడ్‌ లాటిన్‌ ఆమెరికన్‌ సిటిజన్స్‌ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. గిల్లెన్‌ ఆచూకీ చెప్పాలంటూ ఆర్మీ కార్యాలయం ఎదుట, గిల్లెన్‌ స్వస్థలంలో ర్యాలీలు తీశారు. (శిక్షార్హమైన వాటిని కూడా సమ్మతించండి!)

గిల్లెన్‌ ఆచూకీ చెప్పిన వారికి ఆర్మీ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ కమాండ్‌(సీఐడీ) రివార్డును 25వేల డాలర్లుగా ప్రకటించింది. ‘గిల్లెన్‌ ఆచూకీ కనుగొనడానికి కట్టుబడి ఉన్నాము. మా దగ్గరున్న ప్రతి చిన్న సమాచారాన్ని వదలకుండా దర్యాప్తు చేస్తున్నాము. గిల్లెన్‌ ఆచూకీ లభించేవరకు మా ప్రయత్నాలను ఆపము’ అని ఆర్మీ సీఐడీ ప్రతినిధి క్రిస్‌ గ్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె చివరిసారిసాగా ఫిట్‌నెస్‌ దుస్తు‍ల్లో ఉదారంగు ప్యాంటు, నలుపు రంగు టీ షర్టు వేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో అనుమానితులైన 150 మందిని ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేశారు. ఎఫ్‌బీఐతోపాటూ మిగతా నేర పరిశోధన సంస్థలను సహాయం చేయమని అమెరికా ఆర్మీ కోరింది. ప్రముఖ హాలీవుడ్‌ నటి సల్మాహేక్‌ కూడా గిల్లెన్‌ని రక్షించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. (అమరులైన భారత సైనికులకు అమెరికా సంతాపం)

@findvanessaguillen

A post shared by Salma Hayek Pinault (@salmahayek) on

కాగా, ఆర్మీ క్యాంపులోనే ఓ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధించేవాడని గిల్లెన్‌ పలుమార్లు తన వద్ద ప్రస్థావించినట్టు ఆమె తల్లి గ్లోరియా పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని చెబితే, మిగతా మహిళలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని తన వద్ద గిలెన్‌ వాపోయినట్టు గ్లోరియా చెప్పారు. (బీజింగ్‌లో 1255 విమానాలు రద్దు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top