ఒలింపిక్స్ వేదిక సమీపంలో ఇద్దరి కాల్చివేత | Two shot dead at Rio Olympic sites | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్ వేదిక సమీపంలో ఇద్దరి కాల్చివేత

Aug 7 2016 12:02 AM | Updated on Sep 4 2017 8:09 AM

ఒలింపిక్స్ వేదిక సమీపంలో ఇద్దరి కాల్చివేత

ఒలింపిక్స్ వేదిక సమీపంలో ఇద్దరి కాల్చివేత

ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చిన మారకానా స్టేడియం సమీపంలో శుక్రవారం ఓ దొంగను పోలీసులు కాల్చిచంపారు.

రియో డి జనీరో: ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చిన మారకానా స్టేడియం సమీపంలో శుక్రవారం ఓ దొంగను పోలీసులు కాల్చిచంపారు. మరో వేదిక దగ్గర 51 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మారకానా స్టేడియం వద్ద దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తిని ఓ పోలీసు అధికారి అడ్డగించి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

దీనికి కొన్ని గంటల ముందు ఒలింపిక్ జ్యోతి ఉన్న ప్రాంతానికి కారులో వెళ్తున్న మహిళపై ముగ్గురు దొంగలు దాడిచేసి తుపాకులతో కాల్చి చంపారు. పోటీలు జరిగే వివిధ వేదికల్లో సుమారు 85 వేల మంది సైనికులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. పురుషుల సైక్లింగ్ రేసు ముగిసే కోపాకాబానా సమీపంలో బ్రెజిల్ మిలిటరీ ఆధ్వర్యంలో ఓ బాంబును నిర్వీర్యం చేశారు. నిపుణుల సమక్షంలో దీన్ని పేల్చివే శారు. ఆ సమయంలో పోలీసులు ప్రజలను దూరంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement