బర్త్ డే పార్టీలో సరదా కోసం కాల్పులు, ఇద్దరి మృతి | Two killed in United states birthday party shooting | Sakshi
Sakshi News home page

బర్త్ డే పార్టీలో సరదా కోసం కాల్పులు, ఇద్దరి మృతి

Nov 11 2013 9:17 AM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికాలో తుపాకుల విష సంస్కృతి మరోసారి వికృత రూపం దాల్చింది. ఓ బర్త్ డే పార్టీలో సరదా కోసం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలో తుపాకుల విష సంస్కృతి మరోసారి వికృత రూపం దాల్చింది. ఓ బర్త్ డే పార్టీలో సరదా కోసం జరిపిన కాల్పుల్లో ఇద్దరు  విద్యార్థులు మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

ఓ ఇంటిలో జరిగిన 18 ఏళ్ల అమ్మాయి పుట్టిన రోజు వేడుకులకు వంద మంది హాజరయ్యారు. వీరిలో ఎక్కువగా 18-19 ఏళ్ల వయసు వారున్నారు. పార్టీ జరుగుతుండగా ఓ వ్యక్తి సరదా కోసం గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో మరో వ్యక్తి కంగారుపడి సమూహం వైపు కాల్పులు జరిపాడు. పార్టీలో పాల్గొన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి కిటికీల గుండా కిందికి దూకేశారు. ఈ సంఘటనలో ఓ బాలికతో సహా ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరులో ఆస్పత్రిలో చనిపోయారు. చాలా మంది విద్యార్ఝులు గాయపడ్డారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement