ఫ్లోరిడాలో వ్యక్తి కాల్పులు.. ఆపై ఆత్మహత్య

two dead six injured after florida yoga studio shooting - Sakshi

ఫోర్లిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని టలుహసీలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్కాట్‌ పౌల్‌ బియర్లే(40) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి స్థానిక యోగా సెంటర్‌ సమీపంలోని వ్యాపార సముదాయంలో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మృతులను డాక్టర్‌ నాన్సీ వాన్‌ వస్సెమ్‌(61), ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ విద్యార్థిని మౌరా బింక్లే(21)గా గుర్తించారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top