రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన యువకుడు

In Turkey Baby Falls From Second Floor Caught By Teenager - Sakshi

ఇస్తాంబుల్‌ : రెండేళ్ల ఈ చిన్నారి ఆయుష్షు గట్టిది కాబట్టి.. రెండో అంతస్తు నుంచి కింద పడి కూడా క్షేమంగా బతికి బట్టకట్టగలిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. చిన్నారిని కాపాడిన యువకుడు ఓవర్‌నైట్‌లో హీరో అయ్యాడు. వివరాలు.. ఫ్యూజి జబాత్‌(17) అనే యువకుడు రోడ్డు వెంట నడుచుకుంటు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల చిన్నారి రెండో అంతస్తు నుంచి కింద పడటం జబాత్‌ కంట పడింది. వెంటనే అప్రమత్తమైన జబాత్‌.. పాప కింద పడే చోటు ఊహించి అక్కడకు వెళ్లి నిల్చున్నాడు.

ఫలితంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ చిన్నారిని కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు జబాత్‌ సమయస్ఫూర్తిని, సాహసాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top