గులెన్ సంస్థలను పాక్ మూసేయనుందా.. | Turkey asks Pakistan to shut institutions run by Gulen | Sakshi
Sakshi News home page

గులెన్ సంస్థలను పాక్ మూసేయనుందా..

Jul 23 2016 6:20 PM | Updated on Sep 4 2017 5:54 AM

గులెన్ సంస్థలను పాక్ మూసేయనుందా..

గులెన్ సంస్థలను పాక్ మూసేయనుందా..

టర్కీలో సైనిక తిరుగుబాటుకు ప్రధానసూత్రధారిగా భావిస్తున్న గులెన్‌పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్ను కోరింది.

ఇస్లామాబాద్: టర్కీలో సైనిక తిరుగుబాటుకు ప్రధానసూత్రధారిగా భావిస్తున్న గులెన్‌పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్ను కోరింది. పాకిస్తాన్లో గులెన్ నిర్వహిస్తున్న సంస్థలు, వ్యాపారాలను మూసివేయాలని టర్కీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టర్కీ రాయబారి సాదిక్ బాబర్ గిర్గిన్.. పాక్ను కోరినట్లు మీడియా సంస్థ 'డాన్' వెల్లడించింది.

జులై 16 సైనిక తిరుగుబాటుకు ప్రధానకారకుడు గులెన్ అని నిరూపించే ఆధారాలు టర్కీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని సాదిక్ వెల్లడించారు. గులెన్కు సంబంధించిన కార్యకలాపాలను తమ దేశాల్లో నిర్వహించకుండా చూడాలని టర్కీ మిత్రదేశాలన్నింటినీ కోరుతున్నట్లు సాదిక్ తెలిపారు. పాకిస్తాన్తో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా సాదిక్ గుర్తుచేశారు. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో గడుపుతున్న గులెన్ను అప్పగించాలని టర్కీ అమెరికాను కోరుతున్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా గులెన్ పాకిస్తాన్లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అయితే టర్కీ విన్నపాన్ని పాక్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement