డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది! | Trump wants to bring down the cost of wall on Mexico border | Sakshi
Sakshi News home page

డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది!

Feb 12 2017 9:00 AM | Updated on Apr 4 2019 3:25 PM

డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది! - Sakshi

డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది!

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని, తద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు.

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని, తద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న ట్రంప్.. సరిహద్దు గోడకు అయ్యే ఖర్చు చూసి వెనక్కి తగ్గారు. మెక్సికో- అమెరికా సరిహద్దుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఆ నిర్మాణానికి 21.6 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.  ఆ నిర్మాణంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టంచేసిన ట్రంప్, ఖర్చు మాత్రం కచ్చితంగా సగం తగ్గేలా చూడాలని (దాదాపు రూ.70-80 వేల కోట్లు) అధికారులకు సూచించారు.

మెక్సికో నుంచి అమెరికాకు వలసలు నిరోధించాలంటే 'గ్రేట్ వాల్' నిర్మిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆ నిర్మాణానికి ఖర్చు దాదాపు 12 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.80 వేల కోట్లు ) అవుతుందని ట్రంప్ భావించారు.  తమ దేశంతో పాటు మెక్సికో కూడా ఖర్చులో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటో  నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదివరకే లోక్ హీడ్ మార్టిన్ నుంచి 90 ఎఫ్-35 ఫైటర్ జెట్  విమానాలను కోనుకోలు చేయడానికి 600 మిలియన్ల ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావించి గ్రేట్ వాల్ అంచనా ఖర్చును తగ్గించాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement