బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి | The death toll from a coal mine blast in China's Mongolia region has risen to 32. | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి

Dec 4 2016 11:50 AM | Updated on Apr 3 2019 3:52 PM

బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి - Sakshi

బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి

బొగ్గుగనిలో జరిగిన భారీ పేలుడులో 32 మంది మృతి చెందారు

బీజింగ్‌: చైనాలోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. చిఫెంగ్‌ పట్టణంలోని బౌమా మైనింగ్‌ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో 181 మంది అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తుండగా.. వారిలో 149 మంది ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడినట్లు జిన్హువా వెల్లడించింది.

పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. కాగా.. ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. పోలీసులు, మెడికల్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆదివారం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement