ఆయుధాలు అమ్ముతూ ఫేస్ 'బుక్'య్యారు | Thai students arrested for selling weapons | Sakshi
Sakshi News home page

ఆయుధాలు అమ్ముతూ ఫేస్ 'బుక్'య్యారు.

Feb 26 2016 7:00 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఆయుధాలు అమ్ముతూ ఫేస్ 'బుక్'య్యారు - Sakshi

ఆయుధాలు అమ్ముతూ ఫేస్ 'బుక్'య్యారు

ఫేస్‌బుక్‌లో ఆయుధాలు అమ్ముతున్న ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులను థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు.

బ్యాంకాక్: ఫేస్‌బుక్‌లో ఆయుధాలు అమ్ముతున్న ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులను థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు. ఓ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఫేస్‌బుక్‌ ద్వారా గన్లు, బుల్లెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో వారిద్దరినీ పట్టుకున్నట్టు బ్యాంకాక్ పోలీస్ చీఫ్ సనిత్ మహతావోర్న్ చెప్పారు.

నిందితులను నాంగ్‌చాక్ జిల్లా క్రతుంరాయ్ ప్రాంతానికి చెందిన డామ్రోంగ్ ఓన్‌ర్యున్ (21), పిచ్చాన్ (21) గా గుర్తించారు. వారి నుంచి హ్యాండ్ గన్లు, 200 రౌండ్ల 0.38, 9ఎంఎం బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నెలలుగా తాను ఫేస్‌బుక్ ద్వారా బులెట్లు, ఆయుధాలను విక్రయిస్తున్నట్లు డామ్రోంగ్ పోలీసుల విచారణ అంగీకరించాడు. వీరిపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement