selling weapons
-
దేశాలకు టారిఫ్‌ల షాక్.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్‌ల షాక్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు."ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు. -
ఆయుధాలు అమ్ముతూ ఫేస్ 'బుక్'య్యారు
బ్యాంకాక్: ఫేస్బుక్లో ఆయుధాలు అమ్ముతున్న ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులను థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు. ఓ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఫేస్బుక్ ద్వారా గన్లు, బుల్లెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో వారిద్దరినీ పట్టుకున్నట్టు బ్యాంకాక్ పోలీస్ చీఫ్ సనిత్ మహతావోర్న్ చెప్పారు. నిందితులను నాంగ్చాక్ జిల్లా క్రతుంరాయ్ ప్రాంతానికి చెందిన డామ్రోంగ్ ఓన్ర్యున్ (21), పిచ్చాన్ (21) గా గుర్తించారు. వారి నుంచి హ్యాండ్ గన్లు, 200 రౌండ్ల 0.38, 9ఎంఎం బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నెలలుగా తాను ఫేస్బుక్ ద్వారా బులెట్లు, ఆయుధాలను విక్రయిస్తున్నట్లు డామ్రోంగ్ పోలీసుల విచారణ అంగీకరించాడు. వీరిపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు.


