దేశాలకు టారిఫ్‌ల షాక్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన | Trump to tariff countries selling weapons to Iran | Sakshi
Sakshi News home page

దేశాలకు టారిఫ్‌ల షాక్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

Apr 8 2026 5:26 PM | Updated on Apr 8 2026 5:51 PM

Trump to tariff countries selling weapons to Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్‌ల షాక్‌ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

"ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement