రక్తమోడిన పెషావర్ స్కూల్ మళ్లీ ప్రారంభం | Terror-hit Peshawar school resumes classes | Sakshi
Sakshi News home page

రక్తమోడిన పెషావర్ స్కూల్ మళ్లీ ప్రారంభం

Jan 12 2015 11:24 AM | Updated on Mar 23 2019 8:32 PM

పాకిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాది దాడిలో నెత్తురోడిన పెషావర్ సైనిక పాఠశాలను సోమవారం మళ్లీ ప్రారంభమైంది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాది దాడిలో నెత్తురోడిన పెషావర్ సైనిక పాఠశాల సోమవారం మళ్లీ ప్రారంభమైంది. కొన్ని వారాల తర్వాత విద్యార్థులు, టీచర్లు చేదు జ్ఞాపకాలతో ఈ రోజు పాఠశాలకు వచ్చారు.

ఉగ్రవాదులు పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని మట్టుబెట్టడం ప్రపంచాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది దాడిలో రక్తపుమడుగుల్లా మారిన తరగతి గదులను పూర్తిగా శుభ్రం చేశారు. అలాగే పాఠశాలలో ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. ఈ దాడి అనంతరం పాకిస్థాన్లో భద్రత కారణాల రీత్యా విద్యాసంస్థలను మూసివేసి సెలవులు ప్రకటించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement