బస్సు బోల్తా : ఆరుగురు ప్రయాణికులు మృతి | Six killed, 36 injured as bus overturns in China | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా : ఆరుగురు ప్రయాణికులు మృతి

Jul 6 2014 8:48 AM | Updated on Sep 2 2017 9:54 AM

చైనాలోని చాంగ్కింగ్ నగరంలో బస్సు బోల్తా పడి ఆరుగురు మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చైనాలోని చాంగ్కింగ్ నగరంలో బస్సు బోల్తా పడి ఆరుగురు మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మొత్తం 53 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు టైర్ పేలింది. దాంతో బస్సు బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రమాదం శనివారం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement