బాతుల్ని కాపాడబోయి, ఇద్దర్ని చంపేసింది! | She tried to save ducks, ended up killing two | Sakshi
Sakshi News home page

బాతుల్ని కాపాడబోయి, ఇద్దర్ని చంపేసింది!

Jun 24 2014 2:13 PM | Updated on Sep 2 2017 9:20 AM

బాతుల్ని కాపాడబోయి, ఇద్దర్ని చంపేసింది!

బాతుల్ని కాపాడబోయి, ఇద్దర్ని చంపేసింది!

కోర్టు తన తీర్పులో హైవే లో జంతువులను కాపాడే ప్రయత్నం చేయకూడదని, అవి అడ్డం వస్తే పట్టించుకోవద్దని, ఏది ఏమైనా వాహనాన్ని ఆపవద్దని సూచించింది.

కెనడాకి చెందిన ఒక 25 ఏళ్ల అమ్మాయి రహదారిపై ఉన్న బాతులను కాపాడే ప్రయత్నంలో భారీ యాక్సిడెంట్ కి కారణమైంది. ఆ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీంతో ఇప్పుడు కెనడా కోర్టులు ఆమెని దోషిగా ఖరారు చేశాయి. ఆమెకు 14 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.


ఎమ్మా జోర్నోబాజ్ అనే యువతి హైవేలో బాతు పిల్లలు పోవడం చూసి తన వాహనాన్ని ఆపింది. వాటి తల్లి కనిపించకపోవడంతో వాటిని జాగ్రత్తగా దాటించేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ దీని వల్ల ఆంద్రే రాయ్ అనే 50 ఏళ్ల వాహనదారుడు ఆగకూడని చోట ఆగిన ఆ కారును ఢీకొన్నాడు. ఆయన, ఆయన కూతురు జెస్సీ (16) చనిపోయారు. ఈ సంఘటన 2010 లో జరిగింది.


కోర్టు తన తీర్పులో హైవే లో జంతువులను కాపాడే ప్రయత్నం చేయకూడదని, అవి అడ్డం వస్తే పట్టించుకోవద్దని, ఏది ఏమైనా వాహనాన్ని ఆపవద్దని సూచించింది. తమ తీర్పుతో ఇలాంటి జంతు ప్రేమికులు మనుషుల ప్రాణాల విలువను గుర్తించాలని పేర్కొనడం కొసమెరుపు.


అయితే ఎమ్మాకు మద్దతుగా జంతు ప్రేమికులు ఉద్యమాలు చేయాలని, ఆమె కోసం పిటిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ లో ఆమెకు మద్దతుగా చాలా మంది గళం విప్పుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement